శ్రీశక్తి ఉచిత బస్సు పథకం – పూర్తి వివరాలు:
శ్రీశక్తి ఉచిత బస్సు పథకం ఏ ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తిస్తుంది?
- పల్లె వెలుగు
- అల్ట్రా పల్లె వెలుగు
- సిటీ ఆర్డినరీ
- మెట్రో ఎక్స్ప్రెస్
- ఎక్స్ప్రెస్
ఉచిత ప్రయాణం వర్తించని బస్సులు:
- నాన్ స్టాప్
- సప్తగిరి ఎక్స్ప్రెస్
- అల్ట్రా డీలక్స్
- సూపర్ లగ్జరీ
- లైనర్
- ఏసీ బస్సులు
శ్రీశక్తి ఉచిత బస్సు పథకం ఎవరు అర్హులు?
బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్స్ – వయసు పరిమితి లేదు. బస్ ఎక్కగానే “Zero Fare Ticket” ఇస్తారు. ఈ టికెట్లో:
- మీ ప్రయాణ దూరానికి సాధారణ ఛార్జ్ ఎంత అవుతుందో
- స్కీమ్ ద్వారా మీరు పొందిన లాభం ఎంత
- సంవత్సరంలో మొత్తం లబ్ధి రికార్డు
శ్రీశక్తి ఉచిత బస్సు పథకం అవసరమైన డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డు / ఓటర్ కార్డు / ఏ ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు
- కార్డులో Gender – Female / Transgender అని ఉండాలి
- ఆంధ్రప్రదేశ్ నివాసి అని ప్రూవ్ కావాలి (District / State పేరు ఉండాలి)
శ్రీశక్తి ఉచిత బస్సు పథకం పథకం ప్రారంభం
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రభుత్వం ఈ పథకాన్ని లాంచ్ చేయనుంది.
ఈ పథకం TDP-జనసేన-బీజేపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి.
ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మంత్రులు పథకానికి ఆమోదం తెలిపారు.
శ్రీశక్తి ఉచిత బస్సు పథకం అమలు విధానం
పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది ప్రభుత్వం.
రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
శ్రీశక్తి ఉచిత బస్సు పథకం బస్సుల సంఖ్య & బడ్జెట్:
- మొత్తం 8459 బస్సులు ఈ పథకం కోసం కేటాయింపు
- వార్షిక బడ్జెట్: ₹1950 కోట్లు
- అదనంగా 700 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు పూర్తయింది
- వచ్చే 2 ఏళ్లలో మరొక 1400 బస్సులు కొనుగోలు చేయాలని ప్లాన్
శ్రీశక్తి ఉచిత బస్సు పథకం గుర్తింపు కార్డులు చూపడం తప్పనిసరి
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు – ఏదైనా ఒకటి చూపించాలి.
గుర్తింపు కార్డు లేకుండా ఉచిత ప్రయాణం అనుమతించరు.
శ్రీశక్తి ఉచిత బస్సు పథకం అమలు కోసం చేసిన అధ్యయనం
క్యాబినెట్ సబ్ కమిటీ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి, అక్కడి ఉచిత బస్సు పథకాలను అధ్యయనం చేసింది.
వారి నివేదిక ఆధారంగా ఏపీలో కూడా మార్పులు, సౌకర్యాలు అమలు చేస్తున్నారు.
శ్రీశక్తి ఉచిత బస్సు పథకం పీక్ టైమ్ & సౌకర్యాలు
పీక్ టైమ్లో రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక ఏర్పాట్లు.
ప్రతి బస్సులో CCTV కెమెరాలు, కండక్టర్లకు బాడీ కెమెరాలు అమర్చడం.
అన్ని బస్ స్టాండ్లలో అదనపు సౌకర్యాలు కల్పించడం.
శ్రీశక్తి ఉచిత బస్సు పథకం ఆర్థిక ప్రభావం
పథకం వల్ల బస్సుల్లో 65% ఆక్యుపెన్సీ పెరుగుతుందని అంచనా.
మహిళలు, విద్యార్థులకు పెద్ద ప్రయోజనం కలుగుతుంది.
శ్రీశక్తి ఉచిత బస్సు పథకం ఆటో డ్రైవర్లపై ప్రభావం
ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
వారికి ఇబ్బంది రాకుండా సహాయం చేయాలని ప్లాన్.
ఆటో డ్రైవర్ యూనియన్లు వాహన మిత్ర పథకం కింద ఇస్తున్న ₹15,000 వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.