AP Current Bills APSPDCL 14 నెలల్లో కరెంట్ బిల్లులు తగ్గించిందా?

కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలల్లో కరెంట్ బిల్లులు తగ్గించిందా? లేక పెంచిందా?

చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చలేకపోయారు?

హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, తర్వాత మరచిపోవడం – ఇది మన రాజకీయాల్లో కొత్తేమీ కాదు. కానీ ఈసారి విషయం కరెంట్ బిల్లుల పెంపు గురించి!”చంద్రబాబు నాయుడు గారు – సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. సంక్షేమం, అభివృద్ధి, విజన్ – అన్నింట్లో మంచి చేశారు. కానీ… ఎన్నికల హామీల విషయంలో మాత్రం గాలి మాటలు అనే ఇమేజ్ ఆయన మీద బలంగా పడింది.2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం దాదాపు 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచింది. 500 రూపాయల బిల్లు 1500-1800 రూపాయలకు చేరింది.
జనం విసిగి పోయారు.”

అప్పుడే చంద్రబాబు గారు వచ్చి ప్రచారంలో స్పష్టంగా చెప్పారు –

‘కరెంట్ చార్జీలు పెంచకుండా, తగ్గించే బాధ్యత మా దే.’

ప్రజలు నమ్మారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.”

ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతోంది… ఏమైంది?
తగ్గించలేదు, అంతే కాకుండా రెండు సార్లు కరెంట్ చార్జీలు పెంచారు.
2024 నవంబరులో, మళ్ళీ ఒకసారి పెంపు.

కారణం?
‘వైసీపీ టైంలో డిస్కమ్స్ నష్టపోయాయి, ఆ నష్టాలను భర్తీ చేసుకోవాలి’ – అని చెప్పారు.
మొత్తం 15,000 కోట్ల పెంపు ఇప్పటికే జరిగింది.”

ఇప్పుడే మళ్ళీ కొత్త ప్రపోజల్ రెడీ అయింది – 12,200 కోట్లు పెంపు!
డిస్కమ్స్ ఏపీఈఆర్సి కి ప్రపోజల్స్ పంపాయి.
అప్రూవల్ వచ్చిందంటే, బిల్లులో ‘ట్రూ అప్ చార్జీలు’ జోడిస్తారు.
2000 రూపాయల బిల్లు → 2300-2400 రూపాయలుగా మారుతుంది.

ఇక్కడ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాల్సింది –
2019-2024 నష్టాలు అని చెప్పి రెండు సార్లు పెంపు చేశాం.
ఇంకా మూడోసారి పెంచితే, జనం జగన్ మీద నెడుతున్నారు అని నమ్మడం ఆపేస్తారు.

ఒకసారి నమ్ముతారు, రెండోసారి నమ్ముతారు… కానీ పదే పదే సాకు చెబితే?
జనం సీరియస్ అవుతారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలవుతుంది.”

ప్రభుత్వం ఇచ్చిన హామీ – కరెంట్ బిల్లులు తగ్గిస్తాం – దాన్ని గుర్తు చేసుకోవాలి.
లేకపోతే, ఈ ఒక్క నిర్ణయం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయొచ్చు.

మీ అభిప్రాయం ఏమిటి?
కరెంట్ బిల్లుల పెంపు తప్పనిసరి అనుకుంటున్నారా, లేక ఇది హామీ విరోధమా?
కింద కామెంట్స్ లో చెప్పండి.

Leave a comment

Exit mobile version