New Smart Ration Card 2025

కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పూర్తి గైడ్ – అర్హతలు, నియమాలు, అప్లికేషన్ ప్రాసెస్ 

రేషన్ కార్డు అంటే చాలా కుటుంబాలకు ఆహార భద్రత, ప్రభుత్వ సబ్సిడీలకు గేట్‌వే. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయబోతోంది. ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ పంపిణీ జరుగుతుంది. అయితే, ఇది అందరికీ కాదు — అర్హత ఉన్నవారికే. కాబట్టి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎలా అప్లై చేయాలి అన్నది స్టెప్-బై-స్టెప్‌గా చూద్దాం.

కొత్త రేషన్ కార్డు అర్హతలు

గ్రామీణ ప్రాంతాల్లో:

  • ఇంటి మొత్తం నెల ఆదాయం ₹10,000 లోపు ఉండాలి.

పట్టణ ప్రాంతాల్లో:

  • ఇంటి మొత్తం నెల ఆదాయం ₹12,000 లోపు ఉండాలి.

కరెంట్ బిల్లు పరిమితి:

  • 12 నెలల యావరేజ్ వినియోగం 300 యూనిట్ల లోపు ఉండాలి. (ఒక నెల ఎక్కువ వచ్చినా పర్వాలేదు, మొత్తాన్ని సగటుగా చూస్తారు).

భూమి పరిమితి:

  • మాగాణి (తడి నేల): 3 ఎకరాల లోపు
  • మెట్ట (పొడి నేల): 10 ఎకరాల లోపు
  • కలిపి 10 ఎకరాలకు మించి ఉండకూడదు.

ఉద్యోగాలు:

  • ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులు లేదా రిటైర్డ్ పెన్షనర్లు అర్హులు కారరు.

వాహన పరిమితులు:

  • ఎల్లో ప్లేట్ (టాక్సీ, ఆటో, అంబులెన్స్) ఉంటే ఓకే.
  • వైట్ ప్లేట్ ఫోర్ వీలర్ ఉంటే అర్హత లేదు.

ఇంకమ్ ట్యాక్స్:

  • ఒకసారి అయినా ITR ఫైల్ చేసినా అర్హత లేదు (జీరో రిటర్న్ అయినా సరిపోదు).

 అనర్హతలు

అధిక ఆదాయం ఉన్న కుటుంబాలు.
ఎక్కువ భూమి కలిగిన వారు.
ప్రభుత్వ ఉద్యోగులు / పెన్షనర్లు.
లగ్జరీ వాహనాలు కలిగిన వారు.
ITR ఫైల్ చేసిన వారు.

అవసరమైన డాక్యుమెంట్లు

📄 ఇంటి సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్
📄 కరెంట్ బిల్, భూమి పాస్‌బుక్ (అవసరమైతే)
📄 ఇతర సపోర్టింగ్ డాక్యుమెంట్లు (అడిగితే)

EKYC తప్పనిసరి

🔹 ఆధార్‌లో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి.
🔹 OTP ద్వారా వెరిఫికేషన్ జరగాలి.
🔹 EKYC లేకుంటే రేషన్ కార్డు మాత్రమే కాదు, ఇతర ప్రభుత్వ పథకాలకూ అర్హత ఉండదు.

అప్లికేషన్ ప్రాసెస్

📍 గ్రామాల్లో: సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా.
📍 పట్టణాల్లో: ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ద్వారా.
📍 ఆన్‌లైన్/WhatsApp Governance ద్వారా కూడా ఇంటి నుండే అప్లై చేయవచ్చు.

రేషన్ కార్డు స్ప్లిట్టింగ్

🚩 కుటుంబంలో కొడుకు పెళ్లై వేరుగా ఉంటే, స్ప్లిట్టింగ్ ద్వారా కొత్త కార్డు వస్తుంది.
🚩 హౌస్‌హోల్డ్ స్ప్లిట్టింగ్ ప్రత్యేక షరతులతో ఉంటుంది.

 స్మార్ట్ కార్డు పంపిణీ షెడ్యూల్

📅 ఆగస్టు 25 – ఆగస్టు 31: మండల, జిల్లా స్థాయిలో పంపిణీ.
📅 ఆగస్టు 26 – ఆగస్టు 30: వృద్ధులు, వికలాంగులకు డోర్ డెలివరీ.

🕗 ఉదయం: 8:00 AM – 12:00 PM
🕓 సాయంత్రం: 4:00 PM – 8:00 PM

📌 OTP + బయోమెట్రిక్ వెరిఫికేషన్ తర్వాతే కార్డు ఇస్తారు.

ముఖ్య సూచనలు

⚠️ ప్రింటింగ్ చెన్నైలో జరుగుతోంది – చాలావరకు ఇప్పటికే పూర్తయింది.
⚠️ EKYC చేయని వారు వెంటనే సచివాలయానికి వెళ్లి పూర్తి చేయాలి.
⚠️ ఆధార్‌లో OTP రాకపోతే స్కీమ్స్ ఆమోదం కష్టమవుతుంది.

Leave a comment

Exit mobile version