Pulivendula ZPTC Election Updates

పులివెందుల జెడ్పిటీసీ ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అగ్నిపరీక్షగా మారింది?

టిడిపి పులివెందులలో గెలిస్తే, దాని రాజకీయ ప్రాముఖ్యత ఏమిటి?

టిడిపి పార్టీ పులివెందులలో ఎంత స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు?

పులివెందుల ఎన్నికలో ప్రజల ఓటు బలం గెలుస్తుందా లేదా అధికార బలం గెలుస్తుందా?

ఈరోజు మనం ఒక గమ్యం మార్చే, గమనాన్ని నిర్ణయించే ఎన్నిక గురించి మాట్లాడబోతున్నాం.
2021లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్న అగ్నిపరీక్ష… ఇప్పుడు అదే పరీక్ష జగన్ గారి సొంత నియోజకవర్గం పులివెందులలో జరుగబోతోంది.
ఏం జరుగుతోంది ఈ ఎన్నికల వెనుక? ఎవరిది అసలైన పోల్ మేనేజ్మెంట్? అన్ని విషయాలు ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నా. చివరి వరకు చూడండి.

2021లో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు టిడిపీకి ఒక కఠినమైన పరీక్షగా మారాయి.చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం అయినా… అధికారంలో ఉన్న వైసీపీ:డబ్బు బలంతో,పోలీసుల సహకారంతో,దొంగ ఓట్లతో,పోల్ మేనేజ్మెంట్ టెక్నిక్స్‌తోఅక్కడ మున్సిపాలిటీని గెలుచుకుంది.

వైసీపీ నేతలు ఒక్కో ఓటుకు 5000, 10000ల వరకు ఇచ్చినట్టు చెబుతున్నారు.
టిడిపీ క్యాడర్‌ను బెదిరించడం, కొనడం… ఇలా అన్ని విధాలుగా వ్యవస్థను వాడుకున్నారు.
చివరికి చంద్రబాబు గారు పరాజయం ఎదుర్కొన్నారు – కానీ అదే సమయంలో ప్రజలకు పాఠం కూడా ఇచ్చారు.

ఇప్పుడు అదే కట్టకథ పులివెందులలో రిపీట్ కావాలని చూస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జెడ్పిటిసి ఎన్నిక చాలా హోరాహోరీగా మారింది.

ఎన్నికల గణాంకాలు చూస్తే:

మొత్తం ఓట్లు: 10,598

అంచనా పోలింగ్: 9300 – 9500

వైసీపీకి సహజంగా 6000 ఓట్ల బలం

టిడిపీ టార్గెట్: ఈ 6000లో సగం ఓట్లు లాక్కోవడం

అంటే టిడిపీకి గెలిచే మార్గం ఉంది, కానీ అది చాలా సూక్ష్మంగా, శాస్త్రీయంగా చేయాలి.

టిడిపీ ఇప్పటికే బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకుంది.
గ్రామాల వారీగా, కమ్యూనిటీ వారీగా ఓట్ల లెక్కలు, టార్గెట్ లిస్టులు సిద్ధం చేసుకుంది.
ప్రత్యేకంగా వైసీపీ క్యాడర్‌ని టార్గెట్ చేయడం – కొన్నంతవరకు ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గానే ఉంది.వైసీపీకి పని చేసే కొంతమంది నాయకులు ఆచూకీ లేకుండా పోవడం,పోలింగ్ బూత్‌ల వద్ద టెన్షన్ సృష్టించడం వంటి విషయాలు గమనించవచ్చు.అంటే ఇదంతా చూస్తే పక్కా సాంకేతికంగా డిజైన్ చేసిన ఎలక్షన్ అని చెప్పొచ్చు.

ఇక వైసీపీ విషయానికి వస్తే,ఇది జగన్ గారి సొంత నియోజకవర్గం.ఇక్కడ ఓడిపోతే పార్టీ పరువు పోతుంది. క్యాడర్ డీ మోటివేట్ అవుతుంది.అందుకే అవినాష్ రెడ్డి,సతీష్ రెడ్డి,రవీంద్రనాథ్ రెడ్డివంటి నాయకులు మైదానంలోనే ఉంటున్నారు.వీళ్ళంతా మొండిగా ఫైట్ చేస్తున్నారు.
ఇది నిజంగా ఒక ప్రెస్టీజ్ ఎలెక్షన్.

2021లో కుప్పంలో అధికార బలం గెలిచింది. ప్రజాస్వామ్యం ఓడింది.ఇప్పుడు అదే పునరావృతమవుతుందా? లేక ప్రజలు ఈసారి బలంగా నిలుస్తారా?ఇది ఒక ముఖ్యమైన మలుపు – ఎందుకంటే ఇది కేవలం ఓ స్థానిక ఎన్నిక కాదు.ఇది పార్టీలు ఎలా పనిచేస్తున్నాయో చూపించే అద్దం.

 

Leave a comment

Exit mobile version